By : Oneindia Telugu Video Team
Published : November 05, 2019, 06:37
Duration : 02:04
02:04
ఇలాగైతే ! T20 వరల్డ్కప్ గెలవడం కష్టం
ఐసీసీ ర్యాంకింగ్స్లో టీమిండియా పురోగతి సాధించని పక్షంలో వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 వరల్డ్కప్ ట్రోఫీ నెగ్గడం చాలా కష్టమవుతుందని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ వేదికగా ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో టీమిండియా ఆటతీరుపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో వెస్టిండిస్తో జరిగిన టీ20 సిరిస్ను 3-0తో కైవసం చేసుకున్నప్పటికీ... ఇటీవలే సొంతగడ్డపై సఫారీలతో ముగిసిన టీ20 సిరిస్ను కోహ్లీసేన 1-1తో సమం చేసింది. తాజాగా బంగ్లాతో జరుగుతున్న టీ20 సిరిస్లో తొలి టీ20లో ఓడిపోయింది.