By : Oneindia Telugu Video Team
Published : March 01, 2021, 05:20
Duration : 01:43
01:43
పిచ్ మారకుంటే.. టీమిండియా పాయింట్లలో కోత విధించాలి!!
గుజరాత్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న నాలుగో టెస్టు పిచ్.. మూడో టెస్టులో లాగే ఉంటే టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్లలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కోత విధించాలని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ అన్నాడు. భారత్ అద్భుతమైన స్టేడియాన్ని నిర్మించిందని, అయితే మోతేరాలో టెస్టు మ్యాచ్లు ఇంకా సుదీర్ఘంగా సాగాలని పనేసర్ పేర్కొన్నాడు. డేనైట్ టెస్ట్ మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోపే ముగిసిన విషయం తెలిసిందే. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ చెలరేగడంతో 10 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.