• search
  • Live TV
    By : Oneindia Telugu Video Team
    Published : August 03, 2018, 03:23
    Duration : 02:25

    ఇండియా VS ఇంగ్లాండ్ :ఇంగ్లాండ్ గడ్డ పై సత్తా చాటిన కోహ్లి

    కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అద్భుత పోరాటపటిమను ప్రదర్శించిన వేళ.. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుంది. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినా అతడి అద్వితీయ సెంచరీతో కోలుకుంది. మ్యాచ్‌ రెండో రోజు, గురువారం తొలి ఇన్నింగ్స్‌లో 100కే ఐదు వికెట్లు కోల్పోయిన భారత్‌.. విరాట్‌ కోహ్లి (149) 225 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్సు భారీ సెంచరీతో 274 పరుగులు చేసింది.
    బాధ్యతనంతా భుజాలపై వేసుకుని జట్టును నడిపించాడు. లేదంటే 100 పరుగులకే ఐదు వికెట్లు చేజార్చుకున్న టీమ్‌ ఇండియా.. ఏ 120 పరుగులకో ఆలౌటై రెండో రోజే ఆతిథ్య జట్టుకు మార్గం సుగమం చేసేదే. జట్టు స్కోరు 54 వద్ద క్రీజులోకి వచ్చిన కోహ్లి స్వింగ్‌ను, సీమ్‌ను జాగ్రత్తగా గమనిస్తూ పోరాటాన్ని కొనసాగించాడు. పట్టుదలతో క్రీజులో పాతుకుపోయాడు. నిజానికి అతడికి ఎవరి నుంచి పెద్దగా సహకారం లభించలేదు. ఎన్నో బంతులను వదిలేశాడు. లోపలికి దూసుకొచ్చిన బంతులను అద్భుతంగా డిఫెన్స్‌ ఆడాడు. కొన్ని సార్లు బంతులు ఎడ్జ్‌లను తాకాయి.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా