కొనసాగుతున్న ధోనీ సంప్రదాయం Dhoni Style Continues
Published : June 30, 2022, 07:10
ఐర్లాండ్‌పై గెలిచిన టీ20 సిరీస్ ట్రోఫీని నేరుగా ఉమ్రాన్ మాలిక్ చేతికి ఇచ్చిన హార్దిక్ పాండ్య.. టీమిండియాలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నెలకొల్పిన సంప్రదాయాన్ని కొనసాగించాడు. అప్పట్లో ధోనీ కెప్టెన్‌గా ఏ సిరీస్ గెలిచినా.. ట్రోఫీని నేరుగా తీసుకెళ్లి.. ఆ సిరీస్‌తో భారత్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యువ ప్లేయర్ చేతికి ఫస్ట్ ఇచ్చేవాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (ఒక సిరీస్ మినహా) కూడా ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఐపీఎల్ 2022 సీజన్లో హార్దిక్ కెప్టెన్సీని చూసిన మాజీ క్రికెటర్లు.. అతన్ని టీమిండియా భవిష్యత్ కెప్టెన్‌గా అభివర్ణిస్తున్నారు.