By: Oneindia Telugu Video Team
Published : November 02, 2017, 12:50

టీ20లో న్యూజిలాండ్‌ ని చిత్తు చేసిన భారత్

Subscribe to Oneindia Telugu

ఫిరోజ్ షా కోట్లా వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20ల్లో కివీస్‌పై వెక్కిరిస్తున్న చెత్త రికార్డుని భారత్ బుధవారం బద్దలుకొట్టింది. అంతేకాదు ఈ విజయంతో టీమిండియా పేసర్ ఆశిష్‌ నెహ్రాకు కోహ్లీసేన ఘనంగా వీడ్కోలు పలికింది. భారత్ నిర్దేశించిన 203 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో న్యూజిలాండ్‌పై భారత్ 53 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 202 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
కివీస్‌పై టీ20ల్లో భారత్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ విజయంతో మూడు టీ20ల ఈ సిరీస్‌‌లో భారత్ 1-0తో ఆధిక్యం‌లో నిలిచింది. 2007 నుంచి ఐదు సార్లు న్యూజిలాండ్‌తో టీ20ల్లో తలపడిన భారత్ జట్టు ఒక్కసారి కూడా గెలవలేదనే చెత్త రికార్డుని కూడా కోహ్లీసేన బద్దలు కొట్టింది. భారీ లక్ష్యఛేదనలో ఓపెనర్లు మార్టిన్ గప్తిల్ (4), మున్రో (7) విఫలమయ్యారు. ఇక, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (28), టామ్ లాథమ్ (39) కొద్దిసేపు భారత్ బౌలర్ల‌ని ధాటిగా ఎదుర్కొన్నారు. ఈ సమయంలో హార్దిక్ పాండ్యా, చాహల్ వీరిద్దరినీ అవుట్ చేసేయడంతో కివీస్‌పై ఒత్తిడి పెరిగింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా