By: Oneindia Telugu Video Team
Published : October 25, 2017, 03:30

న్యూజిలాండ్‌ ను కట్టడి చేస్తున్న భారత్ !

Subscribe to Oneindia Telugu

భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య ఇది 100వ వన్డే మ్యాచ్‌ కావడం విశేషం. టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో కివీస్‌ ఇప్పటికే 1-0 ఆధిక్యం దక్కించుకున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో ఆడిన జట్టుతోనే కివీస్‌ ఈ వన్డేలోనూ బరిలోకి దిగుతోంది. అయితే కోహ్లీ మాత్రం జట్టులో ఒక మార్పు చేశాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌ను జట్టులోకి తీసుకున్నాడు.
పూణె వేదికగా భారత్‌‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ 3 వ వికెట్ కోల్పోయింది. విలియమ్సన్ అవుటైన తర్వాత క్రీజులోకి రాస్ టేలర్ వచ్చాడు.
కాగా పుణె పిచ్‌కు సంబంధించిన రిపోర్టునంతా క్యూరేటర్‌ పాండురంగ్‌ బుకీలకు అందజేసిన నేపథ్యంలో మ్యాచ్‌జరగడంపై తొలుత అనుమానాలు నెలకొన్నాయి. కానీ ఎట్టకేలకు మ్యాచ్ ని రన్ చేస్తున్నారు. దీంతో విచారణ జరిపి పాండురంగ్‌ను సస్పెండ్‌ చేసినట్లు బీసీసీఐ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ అమితాబ్‌ చౌదరి తెలిపారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా