By: Oneindia Telugu Video Team
Published : October 29, 2017, 01:48

ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

Subscribe to Oneindia Telugu

సిరిస్ ఫలితాన్ని తేల్చే మూడో వన్డే ఆరంభమైంది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండో వన్డేలో ఆడిన జట్లే ఈ మ్యాచ్‌లో కూడా బరిలోకి దిగుతున్నాయి. మూడు వన్డేల సిరిస్‌లో ఇరు జట్లు చెరొకటి విజయం సాధించడంతో ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన విజయం సాధిస్తే వరుసగా ఏడో సిరిస్‌ను గెలిచినట్లవుతుంది. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు మూడు.. ఆ తర్వాత మూడు సిరిస్‌లను గెలవడంతో వరుసగా ఆరు సిరీస్‌లను గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పుడు ఏడో సిరీస్ విజయంపై కన్నేసింది.వన్డేలో బాగానే పుంజుకుని సిరీస్‌ను సమం చేసింది. కాన్పూర్‌లో అదే ప్రదర్శనను కొనసాగించి సిరీస్‌ చేజిక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా