By : Oneindia Telugu Video Team
Published : November 08, 2017, 02:38

క్రెడిట్ అంతా బుమ్రాదే

మైదానంలో మెరుపు ఫీల్డింగ్ వల్లే మూడో టీ20లో విజయం సాధించామని భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. తిరువనంతపురం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్‌పై భారత 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి న్యూజిలాండ్‌పై కోహ్లీసేన టీ20 సిరిస్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ కివీస్‌పై టీ20 మ్యాచ్‌నే గెలవని భారత్... తాను కోచ్‌ అయ్యాక 2-1తో సిరీస్‌ సాధించడంపై హర్షం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కించుకున్న బుమ్రా (2/9) తాను తెలివైన, కీలకమైన ఆటగాడినని నిరూపించుకున్నాడని ప్రశంసల వర్షం కురిపించాడు.
ప్రత్యర్థి జట్టుకు ఏ మాత్రం అవకాశాన్ని బుమ్రా ఇవ్వలేదని అన్నాడు. 'భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిశాక.. ఆ స్కోరు కాపాడుకోగలమని భావించాం. మైదానంలో మెరుపు ఫీల్డింగ్‌ వల్లే మూడో టీ20లో విజయం సాధ్యమైంది. ఒత్తిడి లేకుండా ఆడామని ఎవరైనా అంటే అది కచ్చితంగా అబద్ధం చెప్పినట్లే.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా