By: Oneindia Telugu Video Team
Published : October 26, 2017, 02:09

పాండ్యాను కొట్టబోయిన ఫీల్డ్ అంపైర్‌

Subscribe to Oneindia Telugu

పూణె వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డేలో ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది. ఫీల్డ్ అంఫైర్ రాడ్ టక్కర్ నవ్వుతూ భారత బ్యాట్స్‌మెన్ హార్ధిక్ పాండ్యాను చెంపపై కొట్టేంత పని చేశాడు. ఈ సరదా సంఘటన భారత్ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో చోటు చేసుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో భాగంగా 33 ఓవర్లు ముగిశాయి. ఈ సమయంలో డ్రింక్స్ బ్రేక్ వచ్చింది. అప్పటికే టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా (12), దినేశ్‌ కార్తీక్‌ (32) పరుగులతో బ్యాటింగ్‌ చేస్తున్నారు. డ్రింక్స్ బ్రేక్‌కి ముందు చివరి బంతిని పాండ్యా ఆడాడు.
అయితే డ్రింక్స్ బ్రేక్ అనంతరం వీరిద్దరిలో ఎవరు బ్యాటింగ్ చేయాలనే విషయమై తికమకపడ్డారు. దీంతో మైదానంలోని అంఫైర్లు ఇద్దరూ ఒకరితో ఒకరు చర్చించుకున్నారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా