By : Oneindia Telugu Video Team
Published : July 26, 2017, 11:27

ind vs sl టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

శ్రీలంకతో గాలేలో జరగనున్న తొలి టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, పిచ్ గట్టిగా కనిపిస్తోందని, తొలుత బ్యాటింగ్ చేస్తే, అధిక పరుగులను స్కోర్ బోర్డుకు చేర్చవచ్చన్న ఉద్దేశంతోనే బ్యాటింగ్ ఎంచుకున్నానని చెప్పాడు. జలుబుతో కేఎల్ రాహుల్ బాధపడుతూ ఉండటంతో, అతని స్థానంలో శిఖర్ ధావన్ ను తీసుకున్నామని అన్నాడు. పాండ్యా తొలి టెస్టును నేడు ఆడనున్నాడని చెబుతూ, అతనికి అభినందనలు చెప్పాడు. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా