By: Oneindia Telugu Video Team
Published : July 27, 2017, 02:25

పుజారా 153 అవుట్

Subscribe to Oneindia Telugu

భారత్‌, శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో కోహ్లీసేన భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. 399/3 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో భారత్‌ గురువారం రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది.
103వ ఓవర్లో లాహిరు కుమార వేసిన తొలి బంతికి రహానె 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌‌కు చేరాడు. అంతకుముందు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 144 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన పుజారా 97.4వ ఓవర్లో హెరాత్‌ బౌలింగ్‌లో పుజారా 153 పరుగుల వద్ద అవుటయ్యాడు.పుజారా, రహానెల జోడీ నాలుగో వికెట్‌కి 137 పరుగులు నమోదు చేశారు. ప్రస్తుతం 106 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 456 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో రవిచంద్రన్‌ అశ్విన్‌ 24, సాహా 5 పరుగులతో ఉన్నారు. తొలి రోజు ఆటలో భారత్‌ 3 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా