By: Oneindia Telugu Video Team
Published : July 26, 2017, 05:32

నిరాశపరిచిన కోహ్లీ

Subscribe to Oneindia Telugu

శ్రీలంకలోని గాలే టెస్టులో బౌండరీలు వర్షంలా కురుస్తున్న వేళ, టెస్టు మ్యాచ్ వన్డే మ్యాచ్ లా కనిపిస్తుండగా, 41వ ఓవర్ లోనే భారత స్కోరు 200 పరుగుల మైలురాయిని దాటింది. అది కూడా ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి. భారత తొలి ఇన్నింగ్స్ లో ఇప్పటివరకూ 27 ఫోర్లు రావడం విశేషం. అంటే మొత్తం స్కోరులో సగానికి పైగా పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి.శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో పటిష్ట స్థితిలో ఉన్న టీమిండియా వడివడిగా రెండు కీలక వికెట్లను కోల్పోయింది. శిఖర్ ధావన్ డబుల్ సెంచరీ మిస్ చేసుకోగా... కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. 8 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ నువాన్ ప్రదీప్ బౌలింగ్ లో కీపర్ డిక్ వెల్లాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం అజింక్యా రహానే క్రీజులోకి వచ్చాడు. పుజార నిలకడగా ఆడుతూ 149 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 294 పరుగులు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా