By: Oneindia Telugu Video Team
Published : July 25, 2017, 05:12

గాలే టెస్ట్ అశ్విన్ కి చాలా స్పెషల్ ఎందుకో తెలుసా?

Subscribe to Oneindia Telugu

గాలే వేదికగా శ్రీలంకతో జరగనున్న తొలి టెస్టు టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ కెరీర్‌లో ఓ మైలురాయి. అశ్విన్‌కు ఇది 50వ టెస్టు కావడం విశేషం. రెండు సంవత్సరాల క్రితం శ్రీలంక పర్యటనకు టీమిండియా వెళ్లింది. అప్పుడు కూడా ఇదే గాలేలో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. గాలేలో శ్రీలంకతో తొలి టెస్టు ఆడే ముందు అశ్విన్‌ వేరు... ఆ తర్వాత అశ్విన్‌ వేరు. అప్పటి వరకు ఆడిన 25 టెస్టుల్లో అతను 98 వికెట్లు మాత్రమే తీశాడు. భారత్‌ ఆడిన గత 13 టెస్టుల్లో అశ్విన్‌ని 7 మ్యాచ్‌లలో పక్కన పెట్టారు. అయితే రెండేళ్ల క్రితం గాలే టెస్టు అశ్విన్‌ తల రాతను మార్చింది

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా