By: Oneindia Telugu Video Team
Published : July 25, 2017, 06:22

భారత్ vs లంక ... రేపే... మ్యాచ్ స్పెషాలిటీస్ ఇవే

Subscribe to Oneindia Telugu

సొంతగడ్డపై ఈ ఏడాది టెస్టు సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా మళ్లీ ఐదు రోజుల టెస్టు ఫార్మెట్‌కు సన్నద్ధమైంది. శ్రీలంకతో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ఆడేందుకు గాను ఇప్పటికే కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అక్కడికి చేరుకుంది. బుధవారం (జులై 26) నుంచి గాలే వేదికగా ఆతిథ్య శ్రీలంకతో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. ఈ ఏడాది జనవరిలో ధర్మశాలలో చివరి టెస్టు ఆడిన కోహ్లీసేన, ఆ తర్వాత ఐపీఎల్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండిస్ పర్యటనలో బిజీగా క్రికెట్ ఆడారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం కోహ్లీ సేన లంక పర్యటనకు ఓ ప్రత్యేకత ఉంది. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే శ్రీలంకపై సిరిస్‌ విజయంతో కోహ్లీసేన విజయ యాత్రను మొదలు పెట్టింది. ఆ తర్వాత ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై ఇలా వరుసగా టెస్టు సిరిస్‌లను గెలుచుకుంది.ఇప్పుడు మరోసారి టెస్టు క్రికెట్ ఆడేందుకు కోహ్లీసేన సన్నద్ధమైంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా