By : Oneindia Telugu Video Team
Published : November 15, 2017, 07:20

లంకతో అంత ఈజీ కాదు, అందుకే నేను ఆడుతున్నా!


'నాకు కూడా రెస్ట్ కావాలి.. నేనేమీ రోబోను కాదు.. నా చ‌ర్మాన్ని కోస్తే ర‌క్తమే వ‌స్తుంది' ఈ వ్యాఖ్యలు అన్నది ఎవరో తెలుసా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. శ్రీలంకతో కోల్‌కతాలోన ఈడెన్ గార్డెన్స్ వేదికాగ గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో కోహ్లీ బుధవారం మీడియాతో మాట్లాడాడు.
నాకు అవ‌స‌ర‌మైన‌ప్పుడు విశ్రాంతి అడుగుతా. ఓ ప్లేయర్ ఎంత పని భారాన్ని మోస్తున్నాడన్నదానిపై రెస్ట్ ఇవ్వడం ఆధారపడి ఉంటుంది. అది ఒక్కో ప్లేయర్‌కు ఒక్కోలా ఉంటుంది' అని కోహ్లీ అన్నాడు. అసలు కోహ్లీ నోటి వెంట ఈ సమాధానం ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా! ఆల్‌ రౌండర్ హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఎందుకు అన్న ప్రశ్నపై కోహ్లీ పైవిధంగా స్పందించాడు. తన ఫిట్‌నెస్‌ను మళ్లీ మెరుగుపరుచుకునేందుకు పాండ్యాకు రెస్ట్ కోరాడని కోహ్లీ ఈ సందర్భంగా చెప్పాడు.
చాలా క్రికెట్ ఆడుతున్నాం. అలాంటప్పుడు మన ప్రిపరేషన్‌లో ఎంత నాణ్యత ఉందో చూసుకోవాలి. ఎన్ని మ్యాచ్‌లు ఆడామన్నది కాదని పాండ్యా అన్నాడు. దీంతో పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడం సరైన నిర్ణయమేనని అనుకుంటున్నా. ప్రతి క్రికెటర్ ఏడాదిలో 40 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలడు. అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే అతడికి విశ్రాంతి అవసరమే' అని కోహ్లీ అన్నాడు. 'ఈ నేపథ్యంలోనే పాండ్యాకు కాస్త విశ్రాంతి ఇచ్చాం. పని భారం ఎక్కువగా ఉన్న ప్లేయర్స్ విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చెప్పాలంటే.. నేను కూడా ఎక్కువ మ్యాచ్‌లు ఆడాను. నాకు కూడా ప్రస్తుతం కాస్త విరామం కావాలి' అని కోహ్లీ అన్నాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా