By: Oneindia Telugu Video Team
Published : July 20, 2017, 12:37

శాస్త్రి లు, కుంబ్లే లు వస్తుంటారు పోతుంటారు నా చేతిలో బ్యాట్ ఉంది , ఇవన్నీ పట్టించుకోను

Subscribe to Oneindia Telugu

కొత్త హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి ముందుకు వెళ్తానని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బుధవారం చెప్పాడు. కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు శ్రీలంక పర్యటనకు సిద్ధమైంది. ఈ రోజు శ్రీలంక బయలుదేరనుంది. పర్యటనకు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి సారథి కోహ్లీతో కలిసి తొలిసారి భారత నూతన ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి హాజరయ్యాడు. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడాడు. గతంలో శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు మంచి ప్రదర్శన కనబరిచి సిరీస్‌ను దక్కించుకున్నామని, ఇప్పుడు కూడా అదే తరహాలో సిరీస్‌లను కైవసం చేసుకోవాలని భావిస్తున్నామన్నాడు.అనంతరం కోచ్‌-సారథి సంబంధంపై అడిగిన ప్రశ్నకు తన చేతిలో బ్యాట్‌ మాత్రమే ఉంటోందని, తన దృష్టంతా వీలైనంత మెరుగ్గా బ్యాటింగ్‌ చేయడం, సారథిగా జట్టును నడిపించడమని, మన చుట్టు పక్కల ఎన్నో వార్తలు చక్కెర్లు కొడుతుంటాయని, వాటన్నింటినీ పట్టించుకోవల్సిన అవసరం లేదన్నాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా