By: Oneindia Telugu Video Team
Published : September 11, 2017, 11:42

ధోని 99వ స్టంపింగ్....

Subscribe to Oneindia Telugu

పల్లెకెలె వేదికగా భారత్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. వన్డే కెరీర్‌లో ధోని 99వ స్టంపౌట్‌ చేశాడు. దీంతో వన్డేల్లో అత్యధిక స్టంపింగ్‌లు చేసిన శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర రికార్డుని సమం చేశాడు. కుమార సంగక్కర 404 వన్డేల్లో ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకోగా, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాత్రం 298 వన్డేల్లోనే ఈ ఘనతను సాధించాడు. శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో ఓపెనర్ గుణతిలకను స్టంపింగ్ చేయడం ద్వారా ధోని ఈ ఘనత సాధించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా