By : Oneindia Telugu Video Team
Published : September 11, 2017, 11:44

శ్రీలంక కు 800వ వన్డే ఐతే కోహ్లీకి 300

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. పల్లెకెలె వేదికగా జరుగుతున్న ఈ వన్డేలో టాస్ గెలిచిన కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండానే కోహ్లీసేన బరిలోకి దిగుతోంది. జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని, తొలి వన్డే ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని కోహ్లీ చెప్పాడు. ఈ వన్డే తనకెంతో ప్రత్యేకమని అన్నాడు. కోహ్లీకిది 300వ అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం విశేషం. ఇప్పటి వరకు కోహ్లీ 60 టెస్టులు, 190 వన్డేలు, 49 టీ20లు ఆడాడు. ఈ వన్డే కోహ్లీకి 191వది. ఇప్పటికే తొలి వన్డేలో విజయం సాధించి జోరుమీదున్న కోహ్లీసేన ఈ వన్డేను కూడా గెలుచుకుని ఆధిక్యం సంపాదించాలన్న ఉద్దేశంతో ఉంది. టెస్టు సిరిస్ పరాజయంతో అభిమానుల ఆగ్రహానికి గురైన శ్రీలంక జట్టు మాత్రం ఎలాగైనా ఈ వన్డేలో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా