By: Oneindia Telugu Video Team
Published : December 01, 2017, 04:38

గెలుపు కోసం లంక పాట్లు, వీడియో

Subscribe to Oneindia Telugu

రెండో టెస్ట్‌లో దారుణ ఓటమి నేపథ్యంలో ఢిల్లీలో శనివారం నుంచి జరగనున్న మూడో టెస్ట్‌ కోసం శ్రీలంక జట్టు గట్టిగా కష్టపడుతుంది. శ్రీలంక జట్టు లో కొన్ని మార్పులు కూడా చోటు చేసుకోనున్నాయి. అయితే భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. ఇక రెండో టెస్ట్ లో మాత్రం శ్రీలంక ను చిత్తు చేసి వదిలిపెట్టింది. కాగా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా శనివారం (డిసెంబర్ 2)న మూడో టెస్టు ప్రారంభం కానుంది. దీనికోసం శ్రీలంక ప్రాక్టిసు సెషన్ లో పాల్గొని నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టిస్ చేస్తుంది. ఇప్పటికే సొంతగడ్డపై అన్ని ఫార్మట్స్ లో వైట్ వాష్ చేయించుకున్న శ్రీలంక జట్టు ఈ సారి దాన్ని తప్పించుకోవాలని చూస్తుంది.
ఈ టెస్టులో కోహ్లీసేన గెలిచిన లేదా డ్రా చేసుకున్నా ప్రపంచ రికార్డుని సమం చేయనుంది. కోహ్లీసేన ఇప్పటివరకు 8 టెస్టు సిరిస్ విజయాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ వేదికగా జరిగే మూడో టెస్టులో కోహ్లీసేన గనుక విజయం సాధిస్తే 2005-08 మధ్య ఆస్ట్రేలియా సాధించిన వరుస సిరీస్ విజయాల రికార్డును సమం చేస్తుంది.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా