By: Oneindia Telugu Video Team
Published : December 16, 2017, 04:28

మూడో వన్డే : గెలిచితీరాలనేంత కసిగా

Subscribe to Oneindia Telugu


భారత్ -శ్రీలంకలకు మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు వేదికగా విశాఖపట్టణంను ఎంచుకోగా అక్కడ ఇప్పటికే ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలమని విశ్లేషకుల అంచనా. ఈ క్రమంలో టాస్ గెలుచుకున్న జట్టు ముందు బ్యాటింగ్‌ను ఎంచుకోవడమే శ్రేయస్కరమంటూ అభిప్రాయపడుతున్నారు.రెండో వన్డేలో ఘోర పరాజయం చవిచూసిన శ్రీలంక ఏదో ఒక మాయ చేసైనా గెలిచితీరాలనేంత కసిగా ఉంది. మొదటి వన్డేలో ఓడిపోవడంతో అదే స్థాయిలో ప్రత్యర్థి జట్టుకు భారత్ బదులిచ్చింది. ఈ నేపథ్యంలో ఇదే పంథా కొనసాగించాలని భారత్ జట్టు ఆరాటపడుతోంది.
ముందు బ్యాటింగ్‌ చేసిన జట్టు 270 నుంచి 300 పరుగులు చేయగలదని అంచనా. విశాఖలో రాత్రి మంచు కురుస్తుంది. తొలుత బ్యాటింగ్‌ చేసే జట్టుకు ఇది ప్రతికూలాంశమే. అయితే స్కోరుబోర్డుపై వీలైనన్ని ఎక్కువ పరుగులు ఉన్నప్పుడు మంచు ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని వారి ఉద్దేశ్యం.
మూడో సారి ద్విశతకంతో మెరిసిపోతున్న రోహిత్ అమ్మమ్మ ఊరు కూడా ఇదే అవడం విశేషం. హోరాహోరీగా తలపడనున్న ఆఖరి వన్డేలో ఇరు జట్లు గెలవాలనే పట్టుదలను బలంగా చూపిస్తున్నారు. కాగా, శుక్రవారం భారత్ జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. మొహాలీ వేదికగా జరిగిన శ్రీలంక వన్డే మ్యాచ్ బుధవారం జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకకు ఘోర పరాజయం ఎదురైంది. అంత క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టులో ప్రధాన పాత్ర పోషించాడు ఏంజిలొ మాథ్యూస్. జట్టు స్కోరు 251 కాగా అందులో మాథ్యూస్ ఒక్కడే 111పరుగులు చేశాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా