By: Oneindia Telugu Video Team
Published : August 05, 2017, 06:07

అశ్విన్ మరో రికార్డు అనిల్‌ కుంబ్లే కు దగ్గరలో....

Subscribe to Oneindia Telugu

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనత సాధించాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ తన స్పిన్‌ మాయాజాలంతో శ్రీలంకను కట్టడి చేశాడు. అశ్విన్‌కు జతగా రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీలు కూడా రాణించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో లంచ్ విరామ సమయానికి 49.4 ఓవర్లలో 183 పరుగులకే అలౌటైంది.
భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ 5 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమి రెండో రెండు వికెట్లు తీశారు. అశ్విన్ తన కెరీర్‌లో 5 వికెట్ల ఫీట్‌ని 26వ సారి సాధించాడు. దీంతో టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (25 సార్లు)ను అధిగమించాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా