By: Oneindia Telugu Video Team
Published : July 26, 2017, 11:42

పాండ్యా గురించి కోహ్లి... ఇది మంచి ఛాన్స్

Subscribe to Oneindia Telugu

ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా టెస్టు అరంగేట్రానికి ఇదే సరైన సమయమని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. బుధవారం నుంచి శ్రీలంకతో గాలే వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.
'ఎలాంటి సందర్భంలోనైనా వికెట్లు తీసే సత్తా ఉన్న పాండ్యా లాంటి ఆటగాడు దొరికాడు. టెస్టు క్రికెట్ ఆడే మంచి అవకాశం అతడికి లభించింది. ఇది మాకు ఎంతగానో సహకరిస్తుంది. ఎక్స్‌ట్రా బ్యాట్స్‌మెన్ జట్టుకు కలిసొస్తుంది. ఈ సిరిస్‌లో కొత్త ప్రణాళికలతో ముందుకు వెళతాం. మా ప్రధాన బౌలర్లు వికెట్లను ఎలా తీస్తారనేదే ఇక్కడ ముఖ్యం' అని కోహ్లీ అన్నాడు.ఇక రోహిత్ శర్మను టెస్టుల్లో ఓపెనర్‌గా వినియోగించుకునే విషయమై కోహ్లీ మాట్లాడుతూ 'టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ ఎప్పుడూ ఓపెనర్‌గా దిగలేదు. అయితే రోహిత్‌ను ఓపెనర్‌గా పంపి ప్రయోగాలు చేయలేం. ఎందుకంటే ఓపెనింగ్ కోసమే మన జట్టులో స్పెషల్ బ్యాట్స్‌మెన్‌లు ఉన్నారు' అని కోహ్లీ పేర్కొన్నాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా