• search
By : Oneindia Telugu Video Team
Published : December 02, 2017, 04:54
Duration : 01:38

కోహ్లీ @ 5000


ఫిరోజ్ షా కోట్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు, తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీ 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఢిల్లీ టెస్టులో తొలిరోజు 25 పరుగులు పూర్తి చేయగానే కోహ్లీ ఈ ఘనత సాధించాడు.
విరాట్‌ కోహ్లీకి ఇది 63వ టెస్టు. ఇన్నింగ్స్‌లో లక్మల్‌ వేసిన 30.3వ బంతిని బౌండరీకి తరలించి కోహ్లీ 5000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున అత్యంత వేగంగా ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. 105 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు.
ఇక, మొత్తంగా చూస్తే భారత్‌ తరఫున టెస్టు క్రికెట్లో 5వేల పరుగుల క్లబ్‌లో చేరిన 11వ ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. ఇక, సమయం పరంగా చూస్తే భారత్ తరఫున 2,358 రోజుల్లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ద్రవిడ్‌ 2,252 రోజులతో అందరికంటే ముందున్నాడు. సచిన్‌ (25 ఏళ్ల 301 రోజులు) తర్వాత ఈ ఘనత సాధించిన పిన్క వయస్కుడిగా కోహ్లీ (29 ఏళ్ల 27 రోజులు) నిలిచాడు.
భారత్ తరఫున టెస్టుల్లో అత్యంత వేగంగా 5000 పరుగుల మైలురాయిని అందుకున్న రికార్డు క్రికెట్ లెజెండ్ సునీల్ గావస్కర్ పేరిట ఉంది. గవాస్కర్ 95 ఇన్నింగ్స్‌ల్లోనే 5000 పరుగులు పూర్తి చేశాడు. సెహ్వాగ్ 99 ఇన్నింగ్స్‌ల్లో, సచిన్ 103 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more