By: Oneindia Telugu Video Team
Published : July 26, 2017, 06:27

ధావన్ షాట్‌... లంక క్రికెటర్ వేలు ఫట్ ...చిట్లింది

Subscribe to Oneindia Telugu

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ కొట్టిన బంతిని అందుకునే ప్రయత్నంలో శ్రీలంక క్రికెటర్ తీవ్రంగా గాయపడ్డాడు. రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్టు క్రికెట్‌లో చోటు దక్కించుకున్న శిఖర్ ధావన్ ఆరంభం నుంచే నిలకడగా ఆడుతూ శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 31 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌలర్ లాహిరు కుమార బౌలింగ్‌లో ధావన్ కొట్టిన బంతిని.. సెకండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న అసేలా గుణరత్నె క్యాచ్‌గా అందుకునేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి వేగం, గమనాన్ని అంచనా వేయడంలో విఫలమైన గుణరత్నె తడబడ్డాడు.ఈ తడబాటుతో అతని ఎడమచేతి బొటనవేలిని చీల్చుకుంటూ బంతి వెళ్లిపోయింది. దీంతో ప్రాథమిక చికిత్స అనంతరం గుణరత్నెని కొలంబోకి సర్జరీ కోసం తరలించినట్లు శ్రీలంక చీఫ్ సెలక్టర్ సనత్ జయసూర్య వెల్లడించాడు

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా