By: Oneindia Telugu Video Team
Published : August 07, 2017, 01:22

రాహుల్, కోహ్లీ డాబ్ స్టైల్ సంబరాలు వీడియో హల్ చల్

Subscribe to Oneindia Telugu

గాలే టెస్టుకి వైరల్ ఫీవర్ కారణంగా దూరమైన ఓపెనర్ కేఎల్ రాహుల్ కొలంబో టెస్టులో తన పునరాగమనాన్ని ఘనంగానే చాటుకున్న సంగతి తెలిసిందే. ఐతే శ్రీలంక తో జరిగిన రెండో టెస్టులో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.లెగ్ వికెట్‌కి దూరంగా వైడ్ రూపంలో అశ్విన్ బంతి విసరగా దానిని గల్లీ దిశగా తరలించేందుకు ఉపుల్ తరంగ ప్రయత్నించాడు. అయితే ఆ బంతి బ్యాట్‌ని తాకి నేరుగా రాహుల్ శరీరంపైకి దూసుకొచ్చింది. ఈ సమయంలో క్యాచ్ అందుకోలేకపోయిన రాహుల్ చాకచక్యంగా వ్యవహరించి బంతిని అలానే శరీరంపై అదిమిపట్టుకున్నాడు. ఈ క్యాచ్‌కి నివ్వెరపోయిన ఉపుల్ తరంగ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. దీంతో భారత జట్టు సంబరాలు చేసుకుంది. ఈ సంతోషంలో కేఎల్ రాహుల్ మైదానంలో తిరుగుతూ సంబరాలు చేసుకున్నాడు. ఫుట్‌బాల్ క్రీడాకారుల తరహాలో రాహుల్, కోహ్లీ డాబ్ స్టైల్ సంబరాలు చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా