By: Oneindia Telugu Video Team
Published : July 06, 2017, 01:10

సిరిస్ చిక్కేనా? కోహ్లీసేన సత్తా చాటుతుందా?

Subscribe to Oneindia Telugu


వెస్టిండిస్‌తో ఐదు వన్డేల సిరిస్ ముగింపు దశకు చేరుకుంది. భారత్, వెస్టిండిస్ జట్లు గురువారం చివరిదైన ఐదో వన్డేలో కింగ్ స్టన్ వేదికగా తలపడనున్నాయి. సిరీస్‌లో ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత్, ఈ మ్యాచ్‌ గెలిస్తే సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. నాలుగో వన్డేలో భారత్‌ 189 పరుగులకే విండీస్‌ను కట్టడి చేశాక.. సిరీస్‌ భారత్‌ చేజిక్కినట్లేనని అనుకున్నారంతా. కానీ బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ విఫలం కావడంతో భారత్‌ 11 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. నాలుగో వన్డేలో అనూహ్య విజయంతో తమకు కలిసొచ్చిన మైదానంలో మరో గెలుపు సాధించాలని విండిస్ జట్టు పట్టుదలగా ఉంది.నాలుగో వన్డేలో ధోని నెమ్మదైన ఇన్నింగ్స్‌ ఓటమికి కారణంగా పైకి కనిపిస్తున్నా టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తుంది

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా