By: Oneindia Telugu Video Team
Published : June 27, 2017, 04:51

డ్వేన్ బ్రావో ఇంట్లో కోహ్లీ, ధోని, ధావన్

Subscribe to Oneindia Telugu

ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ ఆడేందుకు కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సిరిస్‌లో భాగంగా గత శుక్రవారం జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, ఆదివారం జరిగిన రెండో వన్డేలో వెస్టిండిస్‌పై టీమిండియా 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.మ్యాచ్ ముగిసిన వెంటనే టీమిండియా ఆటగాళ్లు కోహ్లీ, రహానె, ధావన్‌ తదితరులు ఈ విందు కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోని ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 'బ్రావో నివాసంలో విలువైన సమయం గడిపాం' అని తన ట్విట్టర్లో ఓ ఫోటోని పోస్టు చేశాడు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా