By: Oneindia Telugu Video Team
Published : July 31, 2017, 05:05

మిథాలీ రాజ్‌కు కేసీఆర్‌ బహుమానం ఏంటో తెలుసా ?

Subscribe to Oneindia Telugu

ఐసీసీ మహిళా క్రికెట్ వరల్డ్ కప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌కు తెలంగాణ సీఎం నజరానా ప్రకటించారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను మిథాలీ కలిశారు.
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మిథాలీ, కోచ్ ఆర్.ఎస్.ఆర్. మూర్తికి శాలువా కప్పి సన్మానించారు. మిథాలీని అద్భుత క్రికెటర్ గా తీర్చిదిద్దారంటూ కొచ్ ను ప్రశంసించారు. ప్రపంచ కప్ పోటీల్లో అద్భుతంగా ఆడారని ,దురదృష్టవశాత్తూ కొద్ది తేడాతో పైనల్‌లో ఓడిపోయారన్నారు. అయినప్పటికీ మీ జట్టంతా అద్భుతంగా ఆడిందన్నారు. తాను ఫైనల్ మ్యాచ్ చూశానని కెసిఆర్ చెప్పారు. మిథాలీ రాజ్‌కు ప్రభుత్వం తరుఫున రూ.కోటి నగదు ప్రోత్సాహాన్ని, బంజారాహిల్స్ లో 600 గజాలకు తక్కువ కాకుండా నివాస స్థలాన్ని ఇవ్వనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. కోచ్ మూర్తికి రూ.25లక్షల నగదు ప్రోత్సాహం ప్రకటించారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా