By: Oneindia Telugu Video Team
Published : November 08, 2017, 02:41

ప్రయాణికుడిపై "IndiGo"పైశాచిక దాడి (వీడియో)

Subscribe to Oneindia Telugu

సాదారణంగా ప్రయాణికులు వర్కర్స్ తో రాష్ గా ప్రవర్తించటం జరుగుతూ ఉంటుంది. ఐతే ఎవరు ఎవరితో అమర్యాదగా ప్రవర్తించినా దానికి కొంత లిమిట్ ఉంటుంది. ఎంతవరకూ మాటలతో సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప మేన్హ్యాండ్లింగ్ అనేది మాత్రం చాలా తప్పు. కానీ ఈ మధ్య అందరికి అదే ప్యాషన్ అయిపొయింది. మాటలు చేతల దాకా వెళ్తున్నాయి. అయితే దీంతో పాటు ఇటీవల కాలంలో ప్రయాణికుల పట్ల విమాన, విమానాశ్రయ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇటీవల విమానాశ్రయాలో ప్రముఖ బాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుపట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఘటన మరువక ముందే ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది మరో పైశాచికం బయటపడింది.
తాజాగా, ఇండిగో సిబ్బంది ప్రయాణికుడిపై దౌర్జన్యానికి దిగడం కలకలం రేపింది. ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో బహిర్గతమవడంతో ఈ ఘటన నిన్న viral అవుతూ వెలుగుచూసింది.వివరాల్లోకి వెళ్తే రాజీవ్ కటియాల్ అనే ప్రయాణికుడు అక్టోబరు 15న ఇండిగో 6E 487 విమానంలో చెన్నై నుండి ఢిల్లీకి వెళ్ళారు. ఐతే విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆయన టార్మినల్ వద్ద ఉన్న బస్సుల వద్దకు వెళ్ళారు. అక్కడ తీవ్రమైన ఎండ వేడి ఉండటంతో సమీపంలోని చెట్టువద్ద నిల్చున్నారు. ఆయన నో ఎంట్రీ జోన్‌లో నిల్చున్నట్లు టార్మాక్ సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆయనతో దురుసుగా మాట్లాడారు.

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా