By : Oneindia Telugu Video Team
Published : May 02, 2017, 06:44

పాపం డైలమా లో ఢిల్లీ

ఈ సీజన్‌లో ఢిల్లీ ఆటతీరు నానాటికి తీసికట్టుగా మారుతోంది. పంజాబ్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో కేవలం 67 పరుగులకే కుప్పకూలింది. టోర్నీ చరిత్రలో ఢిల్లీకిదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. జట్టులో బ్యాట్స్‌మెన్‌ బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కన్పిస్తోంది. మరోవైపు తొడకండరాల గాయంతో కెప్టెన్‌ జహీర్‌ ఖాన్‌ దూరమవడం జట్టును ఇబ్బందులకు గురిచేస్తోంది. మరోవైపు ఇంగ్లండ్‌ ప్లేయర్లు సామ్‌ బిల్లింగ్స్, క్రిస్‌ మోరిస్, దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబడ ఈ వారం నుంచి టీమ్‌ నుంచి వైదొలుగుతుండడంతో ఢిల్లీకి మరిన్ని కష్టాలు తోడవనున్నాయి.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా