By : Oneindia Telugu Video Team
Published : April 24, 2017, 12:50

ఓటమి కి కారణం చెత్త బ్యాటింగ్‌, నిర్లక్ష్యమే : కోహ్లీ

చెత్త బ్యాటింగ్‌ కారణంగానే చిత్తుగా ఓడిపోయామని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వ్యాఖ్యానించాడు. తాము దారుణంగా ఆడామని వాపోయాడు. అత్యల్ప స్కోరు నమోదు చేయడాన్ని ఖండించాడు. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 49 పరుగులకే కుప్పకూలి 82 పరుగులతో పరాజయం పాలైంది. ఘోరంగా ఓడిపోవడంపై వ్యాఖ్యానించడానికి మాటలు కూడా రావడం లేదని మ్యాచ్‌ ముగిసిన తర్వాత కోహ్లి అన్నాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా