By: Oneindia Telugu Video Team
Published : May 17, 2017, 11:10

IPL 2017: Qualifier 1: తడబడి నిలబడ్డ పూణే ఫస్ట్ పంచ్ అదిరింది....

Subscribe to Oneindia Telugu

పడుతూ.. లేస్తూ ప్లే ఆఫ్‌కు చేరిన పుణె అసలాటలో పంజా విసిరింది..! తొలి క్వాలిఫయర్‌ పోరులో క్లాసిక్‌ ఆటతో ముంబైని మట్టికరిపించి దర్జాగా ఫైనల్లో అడుగిడింది! సీజన్‌లో ఇండియన్స్‌ను మూడోసారి ఓడించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది..! రహానె, మనోజ్‌, ధోనీ బాధ్యతాయుత బ్యాటింగ్‌తో మోస్తరు స్కోరు చేసినా.. అద్భుతమైన బౌలింగ్‌తో పుణె దాన్ని కాపాడుకుంది..! సాధారణ లక్ష్య ఛేదనలో పార్థివ్‌ పటేల్‌ పోరాడినా.. 17 ఏళ్ల యువ స్పిన్నర్‌ వాషింగ్టన్ సుందర్‌ స్పిన్ వలయంలో చిక్కుకొన్న ముంబై విలవిల్లాడింది..! సొంతగడ్డపై పుణెకు మరోసారి తలొంచింది! ఇక.. క్వాలిఫయర్‌-2లో నెగ్గితేనే ఆ జట్టు ఫైనల్‌ చేరేది..! పుణెతో అమీతుమీ తేల్చుకునేది..!

Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా