By: Oneindia Telugu Video Team
Published : April 11, 2017, 10:43

శతక్కొట్టిన శాంసన్

Subscribe to Oneindia Telugu

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 సీజన్ లో తొలి సెంచరీ నమోదైంది. మంగళవారం ఇక్కడ రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు సంజూ శాంసన్ సెంచరీ సాధించాడు. తద్వారా ఈ ఐపీఎల్లో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. సంజూ శాంసన్ 62 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతకం నమోదు చేశాడు. అయితే సిక్సర్ తో సెంచరీ సాధించిన శాంసన్.. మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. పుణె స్పిన్నర్ ఆడమ్ జంపా వేసిన బంతిని భారీ షాట్ గా ఆడబోయి బౌల్డ్ అయ్యాడు.

Please Wait while comments are loading...
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా