By : Oneindia Telugu Video Team
Published : April 20, 2018, 09:33

బౌండరీలోపలే క్యాచ్‌ను అందుకున్న మనీష్‌

బౌండరీ లైన్‌ వద్ద క్యాచ్‌లు పట్టాలంటే చాలా చురుగ్గా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా అది కాస్తా సిక్స్‌ అవుతుంది. ఇదే జరిగింది తాజా ఐపీఎల్‌ మ్యాచ్‌లో. గురువారం పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఐఎస్‌ బింద్రా స్టేడియంలో కింగ్స్‌ పంజాబ్‌-సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతున్న క్రమంలో ఇది చోటు చేసుకుంది.
కింగ్స్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా హైదరాబాద్‌ స్సిన్నర్‌ షకిబుల్‌ హసన్‌ 12 ఓవర్‌ను వేశాడు. అయితే తొలి బంతికి కింగ్స్‌ ఆటగాడు కరుణ్‌ నాయర్‌ లాంగాఫ్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. కాగా, అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న మనీష్‌ పాండే బంతిని అందుకునే యత్నం చేశాడు. బౌండరీలోపలే క్యాచ్‌ను అందుకున్న మనీష్‌.. నియంత్రించుకునే క‍్రమంలో బంతిని జనాల్లోకి విసిరేశాడు. అది కాస్తా సిక్స్‌ కాగా, క్రికెట్‌ అభిమానులకు మాత్రం మంచి వినోదాన్ని ఇచ్చింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా