By : Oneindia Telugu Video Team
Published : April 10, 2018, 06:56

చెన్నై-కోల్‌కతా మ్యాచ్‌:స్టేడియంలో పాములు

ఐపీఎల్ మ్యాచ్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ -కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగనున్న మ్యాచ్‌కు హెచ్చరికలు వస్తున్నాయి. ఈ మ్యాచ్‌ను కావేరీ నిరసనకారులు అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.
చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించకూడదని తమిళనాడు ప్రజలు, నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు. సినిమా తారలు కూడా మద్దతు తెలిపారు. ఇటీవల రజనీకాంత్ మాట్లాడుతూ.. ఇలాంటి సందర్భంలో మ్యాచులు ఇబ్బందికరమని వ్యాఖ్యానించారు.
తాజాగా, పీఎంకే నేత వేల్‌మురుగన్ మంగళవారం నాటి మ్యాచ్ పైన హెచ్చరికలు జారీ చేశారు. చెపాక్ స్టేడియంలో మ్యాచ్ నిర్వహిస్తే పాముల్ని వదులుతామని హెచ్చరించారు. ఈ హెచ్చరిక కలకలం రేపుతోంది.స్టేడియం వద్ద 4వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. కావేరీ యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని తమిళనాడులో చాలా రోజులుగా నిరసనలు వ్యక్తమవుతున్న విశషయం తెలిసిందే. ఈ విషయమై సోమవారం సుప్రీం కోర్టు స్పందిస్తూ కావేరీ నిర్వహణ ప్రణాళికకు సంబంధించిన ముసాయిదాను రూపొందించి, మే 3వ తేదీ కల్లా తమకు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా