• search
By : Oneindia Telugu Video Team
Published : May 12, 2018, 12:36
Duration : 01:26

IPL 2018: CSK ఓటమికి గల కారణాలు


బౌలింగ్‌కు సంబంధించి వ్యూహాలు రచించినా, అమలు చేయడంలో బౌలర్లు విఫమయ్యారని అందుకే ఓడిపోయామని చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ 'కచ్చితంగా బౌలర్ల వల్లే ఓడిపోయాం. సరైన లెన్త్‌లో బౌలింగ్‌ చేస్తే ఫలితం దక్కేది. కానీ అలా జరగలేదు. ఫలానా ఏరియాలోనే బంతులు విసరాలని చెబితే మా వాళ్లు వేరొకటి చేశారు. వ్యూహాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాం. నిజానికి 176 స్కోరు అనేది విజయం సాధించతగ్గదే. విజయాన్ని మా నుంచి దూరం చేసింది బౌలర్లే' అని అన్నాడు.
మిస్టర్ కూల్‌గా పేరున్న మహేంద్ర సింగ్ ధోని రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో కాస్త ఆగ్రహానికి గురయ్యాడు. 19వ ఓవర్లో డేవిడ్ విల్లీ 2 సిక్స్‌లు ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేశాడు. ఇక, ఆఖరి ఓవర్లో బట్లర్‌ షాట్‌ కొట్టగా బంతి చాలాసేపు గాల్లోనే నిలిచింది. అయినా ఫీల్డర్లెవరూ బంతిని అందుకునే ప్రయత్నం చేయలేదు.
ఇక, టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగి తప్పు చేశారా? అని కామెంటేటర్‌ అని ప్రశ్నకు ధోని 'మాకొక ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఉంది. ఆ కమిటీ నిర్ణయం మేరకు, కోచ్‌ సూచనల ప్రకారం తొలుత బ్యాటింగ్‌ చేస్తాం' అని చెప్పాడు. ఇదిలా ఉంటే
టోర్నీలో వరుసగా రెండో విజయంతో రాజస్థాన్ రాయల్స్‌... ఐపీఎల్‌ ఫ్లే ఆఫ్‌ రేసును రసవత్తరంగా మార్చింది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more