By : Oneindia Telugu Video Team
Published : April 05, 2018, 12:43

వార్నర్‌ను మిస్సయ్యాం: అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ఆ జట్టు పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ పేర్కొన్నాడు. కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్‌కు పాల్పడటంతో డేవిడ్ వార్నర్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌కు డేవిడ్ వార్నర్ దూరమయ్యాడు.
ఐపీఎల్ 11వ సీజన్‌కు వార్నర్ దూరం కావడంతో ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న భువనేశ్వర్‌ కుమార్‌ బుధవారం మీడియాతో మాట్లాడుతూ 'ఈ ఏడాది ఐపీఎల్‌లో డేవిడ్‌ వార్నర్‌ను మిస్సయ్యాం. వార్నర్‌ ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపిస్తాడు. ప్రతి జట్టులో ఇలాంటి ఆటగాడు ఉండటం ఎంతో అవసరం. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మెన్‌గా తన బాధ్యతను ఎంతో సమర్థంగా నిర్వహిస్తాడు' అని అన్నాడు.
వార్నర్ స్థానంలో ఇంగ్లాండ్ క్రికెటర్ అలెక్స్‌ హేల్స్‌‌ను జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయినా సరే వార్నర్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని భువీ తెలిపాడు. ఇక, డేవిడ్ వార్నర్ స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్‌గా న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడంపై కూడా భువీ స్పందించాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా