By : Oneindia Telugu Video Team
Published : April 05, 2018, 04:31

ఐపీఎల్‌ 2018: తెలుగులో కామెంటేటర్లు వీరే, హైదరాబాద్‌లో ట్రోఫీ

ఐపీఎల్ 11వ సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఐపీఎల్‌ను క్రికెట్ అభిమానులను మరింతగా చేరువ చేసేందుకు గాను ప్రసార హక్కులను దక్కించుకున్న స్టార్ నెట్‌వర్క్ ఈసారి ఏకంగా ఆరు భాషల్లో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
కాగా, తెలుగులో సినీ నటుడు ఎన్టీఆర్‌ ఐపీఎల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడే ప్రతి మ్యాచ్‌కు ఎన్టీఆర్‌ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన ప్రోమోలు తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రసారం అవుతున్నాయి.
ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లు తెలుగులో ప్రసారం అవుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ నిర్వాహకులు ఆరు భాషల్లో కామెంటేటర్ల జాబితాను విడుదల చేశారు. తెలుగులో వెంకటపతి రాజు, వేణుగోపాల్‌ రావు, కల్యాణ్‌ కృష్ణ, సి.వెంకటేశ్‌, చంద్రశేఖర్‌, పి.సుధీర్‌ మహావడి కామెంటేటర్లుగా వ్యవహారించనున్నారు.
ఇంగ్లీష్‌, హిందీ, బంగ్లా, కన్నడ, తమిళ్‌, తెలుగు భాష్లలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ జట్టు మెంటార్ వీవీఎస్‌ లక్ష్మణ్‌ హిందీ కామెంటరీ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆరు భాషల్లో కలిపి సుమారు 100 మందికిపైగా కామెంటేటర్లు పనిచేయనున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా