By : Oneindia Telugu Video Team
Published : April 10, 2018, 05:43

ముంబై ఇండియన్స్‌కు ఎదురుదెబ్బ..!

ఐపీఎల్ 11వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ బౌలర్ ప్యాట్ కమిన్స్‌ మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. ఈ మేరకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ మ్యాచ్‌లో విఫలమైన మెక్లిన్‌గన్‌ స్థానంలో కమిన్స్‌ను ఆడించాలని భావించిన రోహిత్‌‌కు నిరాశే ఎదురైంది. ఇదిలా ఉంటే ముంబై ఇండియన్స్ తన తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. హైదరాబాద్‌ వేదికగా ఏప్రిల్ 15న ఈ మ్యాచ్‌ జరగనుంది. జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్‌ వేలంలో కమిన్స్‌ను ముంబై ఇండియన్స్‌ రూ.5.4కోట్లకు దక్కించుకుంది.
ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్‌లో ఆస్ట్రేలియా ఐదు వన్డేలు, ఒక టీ20 సిరిస్ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల గాయాలు ఆస్ట్రేలియా జట్టును కలవర పెడుతోంది. ఇప్పటికే బాల్ టాంపరింగ్ వివాదంతో ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లు ఏడాది పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా