By : Oneindia Telugu Video Team
Published : April 05, 2018, 06:28

వాళ్లకంటే నాకే ఎక్కువ ఆశగా ఉంది: విరాట్ కోహ్లీ

మరో రెండు రోజుల్లో మొదలుకాబోతున్న ఐపీఎల్ పురస్కరించుకొని ఎనిమిది ఫ్రాంచైజీలు వాడీవేడిగా ప్రతిభకు పదునుపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా విజేతగా ట్రోఫీ సంపాదించలేకపోయిన విరాట్ కోహ్లీ ఇలా స్పందించారు. ఐపీఎల్‌ ట్రోఫీని గెలవాలని అభిమానుల కంటే తనకే ఎక్కువ కోరికగా ఉందని అంటున్నాడు. భారత జట్టు కెప్టెన్‌గా ఎన్నో సిరీస్‌లు కైవసం చేసుకున్న కోహ్లీకి ఐపీఎల్‌ ట్రోఫీ ప్రతి సీజన్‌లో అల్లంతదూరాన మిగిలిపోతుంది.
దీంతో ఈ ఏడాది ట్రోఫీని ఎలాగైనా గెలిచేయాలన్నంత కసిగా కోహ్లీ సేన కనిపిస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా కోహ్లీ ప్రాక్టీస్‌ సెషన్‌ అనంతరం మాట్లాడాడు. ఇప్పటికి మూడు సార్లు ఫైనల్‌కు చేరి రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న ఆర్సీబీ ఈసారి కచ్చితంగా టైటిల్ గెలుస్తుందని కోహ్లీ అభిమానులకు తెలిపాడు.
‘రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) అభిమానుల కంటే నాకే ఎక్కువగా ఐపీఎల్‌ ట్రోఫీని గెలుచుకోవాలని ఉంది. పదేళ్లుగా ఆర్‌సీబీ జట్టులో ఉన్నాను. మూడు సార్లు(2016, 2011, 2009) ఫైనల్‌ వరకు వెళ్లాం. కానీ, ట్రోఫీ అందుకోలేకపోయాం. ఈ సారి మాత్రం మా జట్టు ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. 120 శాతం కష్టపడతాం' అని కోహ్లీ తెలిపాడు.
గతంలో మా జట్టు ఒక్క బ్యాటింగ్‌లోనే బలంగా ఉండేది. కానీ, ఈ ఏడాది మా బౌలింగ్‌ను పదునెక్కించాం. కాబట్టి ఈసారి ఆర్‌సీబీ విజేతగా నిలిచేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి' అని కోహ్లీ చెప్పాడు. ఆదివారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా