By : Oneindia Telugu Video Team
Published : April 04, 2018, 05:54

మూడు రోజుల ముందే ముంబైకి చేరుకున్న మహీ సేన

మరో మూడు రోజుల్లో మొదలుకాబోతున్న ఐపీఎల్ సీజన్‌కు ధోనీ సేన ముంబైకి చేరుకుంది. రెండేళ్ల నిషేదం అనంతరం కలిసిన జట్టు సభ్యులు ఉల్లాసవంతమైన వాతావరణం మధ్య చెపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రారంభ వేడుక, తొలి మ్యాచ్ ఏప్రిల్ 7వ తేదీన జరుగుతుండటంతో జట్టు సభ్యులంతా ముంబైకి ప్రయాణమయ్యారు.
ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసింది. మంగళవారం రాత్రికి ముంబైలో అడుగుపెట్టామని తెలిపింది. ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించిన వీడియోను అభిమానులతో పంచుకుంది చెన్నై జట్టు.
ఇన్నాళ్లు చెపాక్ స్టేడియం వేదికగా ప్రాక్టీస్ చేసిన చెన్నై జట్టు ఈ మూడు రోజులు వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ చేయనుంది. మరో పక్క తొలి మ్యాచ్ ప్రత్యర్థి అయిన ముంబై ఇండియన్స్ సొంతగడ్డపైనే మ్యాచ్ ఆడనుండటంతో ప్రాక్టీస్‌పైనే ధ్యాస ఉంచింది.
తొలి మ్యాచ్ లో పోటీపడుతున్న ఇద్దరు కెప్టెన్లే ఆరంభ వేడుకకు హాజరుకానున్నారు. ధోనీ, రోహిత్ శర్మలు మాత్రమే. మిగిలిన జట్ల కెప్టెన్లు కోహ్లీ, రహానె, అశ్విన్, గౌతం గంభీర్, కేన్ విలియమ్సన్, దినేశ్ కార్తీక్‌లు మాత్రం మ్యాచ్ జరిగే రోజునే మనకు కనిపించనున్నారు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా