By : Oneindia Telugu Video Team
Published : April 21, 2018, 03:13

IPL 2018: ఐపీఎల్‌ను నేనే కాపాడా: సెహ్వాగ్మ్యాచ్ అనంతరం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న క్రిస్ గేల్ మాట్లాడుతూ 'చాలా మంది నేను ముసలివాడినైపోయానని అనుకున్నారు. ఈ ఇన్నింగ్స్ తర్వాత నేను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. ఈ సెంచరీ నా కూతురికి అంకితం. శుక్రవారం ఆమె బర్త్‌డే. నేను కింగ్స్ పంజాబ్ జట్టులో చేరినప్పటి నుంచీ సెహ్వాగ్ నాకు ఒకటే చెబుతున్నాడు. యోగా, మసాజ్ చేసే వ్యక్తులతోనే ఎక్కువగా గడపమని. నా సక్సెస్‌కు అదే కారణం అనుకుంటా' అని నవ్వుతూ చెప్పాడు.

ఐపీఎల్‌లో నేనేదో నిరూపించుకోవాలని చాలా మంది అన్నారు. అయితే, 'సెహ్వాగ్ తనను ఎంపిక చేసుకొని ఐపీఎల్‌ను కాపాడాడు' అని అన్నాడు. ఈ మాటను సీరియస్‌గా తీసుకున్న సెహ్వాగ్ ఆ తర్వాత ఓ ట్వీట్ చేశాడు. 'నేను ఐపీఎల్‌ను కాపాడాను' అంటూ వీరూ చేసిన ట్వీట్‌పై 'అవును' అంటూ గేల్ మరో ట్వీట్ చేశాడు.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా