By : Oneindia Telugu Video Team
Published : October 19, 2020, 03:10
Duration : 03:43
03:43
స్క్రిప్ట్ రాసిందెవరో ? ఒక్క రోజే 3 సూపర్ ఓవర్లు...
వాట్ ఎ మ్యాచ్.. రెండు జట్ల స్కోర్లు సమం కావడమే అరుదైతే.. ఏకంగా సూపర్ ఓవర్ కూడా మరో సూపర్ ఓవర్‌కు దారి తీస్తే ఆ పోరాటాన్ని ఏమని వర్ణించగలం.. ముంబై-పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి అరుదైన సన్నివేశమే ఆవిష్కృతమైంది. నరాలు తెగే ఉత్కంఠతో సాగిన పోరు మునివేళ్ల మీద నిలబెట్టింది. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి రెండు సూపర్ ఓవర్లు ఆడిన మ్యాచ్‌లో పంజాబ్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆఖరి వరకు ఊపిరి సడలినవ్వని ఈ మ్యాచ్‌పై సోషల్ మీడియా వేదికగా ఫన్నీ మీమ్స్, సెటైర్స్ పేలుతున్నాయి. ఈ డబుల్ సూపర్ ఓవర్ అదే జరిగిందా? లేక ఎవరైనా స్క్రిప్ట్ రాసారా అంటూ అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.