By : Oneindia Telugu Video Team
Published : November 06, 2019, 10:20
Duration : 02:10
02:10
నో పవర్ ప్లేయర్ 'నోబాల్'కు ప్రత్యేక అంపైర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్-13ను బీసీసీఐ సరికొత్తగా తీసుకురావాలనుకుంటోంది. ఇందులో భాగంగా పలు ప్రతిపాదనలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే 'పవర్ ప్లేయర్' అనే కొత్త ప్రతిపాదన గవర్నింగ్ కౌన్సిల్ ముందుకు రాగా.. తాజాగా నోబాల్కు ప్రత్యేకంగా అంపైర్ని నియమించాలని మరో ప్రతిపాదన తెరపైకి వచ్చింది. వచ్చే సీజన్ నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ఉంది.చైర్మన్ బ్రిజేశ్ పటేల్ అధ్యక్షతన మంగళవారం ముంబైలో సమావేశమైన ఐపీఎల్ పాలనా కమిటీ (సీజీ) వచ్చే ఏడాది జరుగనున్న సీజన్ కోసం ప్రణాళికలు, విదేశీ ఆటగాళ్ల అందుబాటు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. ఈ సమావేశంలో సీజన్-13ను సరికొత్తగా తీసుకురావాలని చర్చలు చేశారట. అంతేకాదు ఐపీఎల్లో పొరపాట్లకు అవకాశమే ఇవ్వకుండా నిర్వహించాలని సీజీ భావిస్తోందట.