By : Oneindia Telugu Video Team
Published : November 06, 2019, 06:00
Duration : 02:01
02:01
పంజాబ్ కి గుడ్ బై చెప్పిన అశ్విన్ !
టీమిండియా సీనియర్ స్పిన్నర్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ వచ్చే ఏడాది ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. చాలా రోజులుగా అశ్విన్ ఢిల్లీ జట్టులోకి వెళుతున్నాడని వార్తలు వచ్చినా.. పంజాబ్ సహ యజమాని నెస్ వాడియా ఆ వార్తలను ఖండించాడు. అయితే సుదీర్ఘ చర్చల అనంతరం తాజాగా ఏస్ స్పిన్నర్ సేవలను ఢిల్లీ దక్కించుకుంది. ఢిల్లీ జట్టులోకి అశ్విన్ చేరబోతున్నట్టు ఆ ఫ్రాంచైజీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం త్వరలో రానుంది.