By : Oneindia Telugu Video Team
Published : October 26, 2020, 08:50
Duration : 03:55
03:55
Hardik Pandya సిక్సర్ల వర్షం చివరి 4 ఓవర్లు 74 పరుగులు
ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ సునాయాసంగా ఛేదించింది. 18.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ బెన్ స్టోక్స్ మెరుపు శతకం (107 నాటౌట్; 60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. బౌండరీలతో విరుచుకుపడి 59 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. 97 పరుగుల వద్ద ఉండగా.. జేమ్స్ ప్యాటిన్సన్ వేసిన 19వ ఓవర్ మొదటి బంతికి సిక్స్ బాది సెంచరీ చేశాడు. మరోవైపు సంజూ శాంసన్ కూడా హాఫ్ సెంచరీ (54 నాటౌట్; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదాడు. ఇద్దరు చెలరేగడంతో రాజస్థాన్ అద్భుత విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముంబై బౌలర్ ప్యాటిన్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక ఈ విజయంతో ఐపీఎల్-2020 సీజన్లో ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన తొలి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది