By : Oneindia Telugu Video Team
Published : January 16, 2021, 11:20
Duration : 01:55
01:55
IPL 2021 : ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకోనున్న ముంబై !
కరోనా వైరస్ మహమ్మారి ప్రతిబంధకాలను దాటుకుని యూఏఈ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ విజయవంతం అయింది. ఇక 2021లో 14వ సీజన్ రెడీ అవుతోంది. ఐపీఎల్ 2021 ఏప్రిల్ 10 తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ 14వ సీజన్ కోసం ఫిబ్రవరిలో మినీ వేలాన్ని నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే జనవరి 20లోగా తమకు వద్దనుకున్న ఆటగాళ్లను వేలంలోకి విడిచిపెట్టాలని ఫ్రాంఛైజీలకు సూచించింది. దీంతో అన్ని జట్లు తమ ఆటగాళ్ల గత ప్రదర్శనపై కసరత్తుల్ని ప్రారంభించాయి.