By : Oneindia Telugu Video Team
Published : January 21, 2021, 06:40
Duration : 02:32
02:32
ఐపీఎల్ 2021 మినీ వేలం కోసం.. ఇద్దరు తెలుగు ప్లేయర్లను వదులుకున్న SRH
ఐపీఎల్ 2021 మినీ వేలం కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమవుతోంది. ఈ వేలం ప్రక్రియలో భాగంగా బీసీసీఐ ఆదేశాల మేరకు రిటైన్, రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాను బుధవారం ప్రకటించింది. మిగతా జట్లకు భిన్నంగా 22 మందిని రిటైన్ చేసుకున్న హైదరాబాద్.. కేవలం ఐదుగురి ప్లేయర్లనే వదిలేసుకుంది. ఈ ఐదుగురిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన బావనక సందీప్, యర్ర పృథ్వీ రాజ్‌ను రిలీజ్ చేసింది. హైదరాబాద్‌లోని రామ్‌నగర్‌కు చెందిన 28 ఏళ్ల బావనక సందీప్‌ను గత సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కనీస ధర రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. కరోనాతో యూఏఈకి తరలిన ఆ సీజన్లో సందీప్‌కు ఒక్క అవకాశం కూడా రాలేదు. అతను పూర్తిగా బెంచ్‌కే పరిమితమయ్యాడు.