By : Oneindia Telugu Video Team
Published : March 02, 2021, 05:20
Duration : 02:48
02:48
ఐపీఎల్ 2021 వేదికలపై అసంతృప్తి.. ఏ రకంగా చూసినా HYD బెస్ట్ !!
కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఐపీఎల్ 2020ని యూఏఈలో నిర్వహించిన బీసీసీఐ.. ఈ ఏడాది సీజన్‌ను సొంతగడ్డపై నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా ఆరు వేదికల్లో బయో బబుల్ వాతావరణంలో ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై వేదికల్ని ప్రాథమికంగా ఎంపిక చేసింది. అయితే ఈ వేదికలపైసన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి.