MS Dhoni: మ్యాచ్ ఓడినా ఆటగాళ్లను పొగిడిన తలైవా
Published : May 13, 2022, 03:50
పేలవ బ్యాటింగ్‌తోనే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ముంబై ఇండియన్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో చెత్త బ్యాటింగ్‌తో చెన్నై 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని కొనియాడాడు. సూపర్ డెలివరీలతో తమ బ్యాటర్లను ఆరంభంలోనే పెవిలియన్ చేర్చారని చెప్పాడు. అయితే బ్యాటింగ్‌లో విఫలమైన తమ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబర్చాని కొనియాడాడు.